టీడీపీతో పవన్‌ అమీతుమీయేనా?

ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హదాను ఇస్తామన్న హామీతో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం, బీజేపీ కూటమికి ఆపై ఆ విషయాన్ని పూర్తిగా పక్కనపెట్టి, హోదా స్థానంలో సాయం చేస్తామని చెబుతూ, ప్రజలను మభ్యపెడుతుండడంపై జనసేన అధినేత పవన్‌కల్యాన్‌ అమీతుమీ తేల్చుకునేందుకే సిద్ధపడ్డారా? ఇకపై తెలుగుదేశం ఆపర్టీని లక్ష్యంగా చేసుకుంటారా? వైకాపా సభ్యులు బాగా పనిచేస్తున్నారని కితాబివ్వడం వెనుక అర్ధమేంటి? ఇకపై ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తానని, ఎన్నికల్లో పోటీ కూడా చేస్తామని ఇప్పటికే స్పష్టం చేసిన పవన్‌, ఈ ఉదయం తన ట్విట్టర్‌ ఖాతాలో పెట్టిన ట్విట్లు రాజకీయ వరాల్లో సరికొత్త చర్చకుదారితీశాయి. 2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి విజయానికి పవన్‌ కల్యాణ్‌ ప్రచారం ఎంతో కొంత సహకరించిందన్న విషయం అందరికీ తెలిసిందే. ఆ తర్వాత స్పెషల్‌ స్టాటస్‌ ఇవ్వలేమని, 14వ ఆర్థిక సంఘం అంగీకరిందని,వేరే రాష్ట్రాలు పోటీకి వస్తాయని కుంటి సాకుఉల చెబుతూ, స్పెషల్‌ ప్యాకేజీ ఇస్తున్నామని కేంద్రం చెప్పింది. దానికి తెలుగుదేశం పార్టీ కూడా వంతపాడు, హోదాతో ప్రయోజనాలు శూన్యమని, ప్యాకేజీతో నిధులు వస్తాయని ప్రజలకు వివరించే ప్రయత్నాలు చేస్తూ వచ్చింది. ఇదే సమయంలో వైకాపా, కాంగ్రెస్‌ పార్టీలు మాత్రం పార్లమెంట్‌ సాక్షిగా ప్రత్యేక హదా ఇస్తామన్న హామీని నిలబెట్టుకోవాల్సిందేనని పోరాటం చేస్తూనే ఉన్నాయి. కాంగ్రెస్‌ ఎంపి కేవిపి పెట్టిన ప్రైవేట్‌ బిల్లుపై రాజ్యసభలో జరిగిన సభస కూడా అందరికీ తెలిసిందే. ఆ బిల్లుపై ఓటింగ్‌ జరిగితే ఓడిపోవడం ఖాయమని తెలుసుకున్న బీజేపీ దాన్ని మనీ బిల్లుగా ప్రకటిస్తూ, తప్పించుకుంది. ఇతక తనకు అవకాశం వచ్చినప్పుడల్లా హోదా కోసం మాట్లాడుతూనే ఉన్న పవన్‌కల్యాణ్‌, తొలిసారిగా టీడీపీ ఎంపీలే లక్ష్యంగా కాస్తంత కఠినమైన వ్యాఖ్యలే చేశారు. విభజన సమయంలో జరిగిన ఘోర అవమానాన్ని టీడీపీ ఎంపిలు మరిచిపోయినట్టుందని, స్వీయ ప్రయోజనాల కోసం ప్రజల ఆత్మగౌరవాన్ని కేంద్రం వద్ద తాకట్టు పెట్టవద్దని ఆయన అన్నారు. సంయమనం సరైనదే అయినా, ఇంకా ఓపిక పట్టడంతో వచ్చే లాభమేంటని టీడీపీని ప్రశ్నించారు. పనిలో పనిగా కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజును పవన్‌ టార్గెట్‌ చేసుకున్నారు. ఎంపీలు హోదా కోసం మాట్లాడుతున్న వేళ, ఒక్క మాట కూడా మాట్లాడని ఆయన వైఖరి తనను బాధించిందని తెలిపారు.హోదా హామీని ఇచ్చిన తర్వాతే తెలుగుదేశం, బీజేపీలకు ప్రజలు ఓట్లేశారని గుర్తు చేశారు. ఇప్పటి వరకు పవన్‌ ఏం మాట్లాడినా, ఆయన్ను విమర్శించకుండా వస్తున్న టీడీపీ, ఇప్పుడు స్పందిస్తుందో వేచి చూడాలి. బహిరంగ వేదికపలపై మాట్లాడాల్సి వచ్చినప్పుడు, తన సోషల్‌ మీడియాను బీజేపీ నేత వెంకయ్యనాయుడినే తొలి టార్గెట్‌గా చేసుకుని విమర్శలు గుప్పించిన వపన్‌, తెలుగుదేశం నేతల పేర్లు ప్రస్తావించినా అంత ఘాటు విమర్శలు మాత్రం చేయలేదు. ఇక ఇప్పుడు టీడీపిని లక్ష్యంగా చేసుకుని పవన్‌ చేసిన వ్యాఖ్యల వెనుక ఆయన రాజకీయ వ్యూహం ఉందని పరిశీలకులు అంచనా వేస్తున్నారు.