టీడీపీకి ఆర్‌.కృష్ణయ్య గుడ్‌ బై?

త్వరలో రాజకీయ పార్టీ ఏర్పాటు

ఎమ్మెల్యేగా కొనసాగుతున్న బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్‌. కృష్ణయ్య ఆ పార్టీకి గుడ్‌బై చెప్పే యోచనలో ఉన్నట్లు పరోక్షంగా స్పష్టం చేశారు. తెలంగాణలో ఇప్పటికే ఉనికి కోసం పోరాటం చేస్తున్న తెలుగుదేశం పార్టీ కిమరోషాషాక్‌ తగలడం ఖాయమని దీనితో తేలిపోయింది. రాజకీయంగా వెనకబాటుతనానికి గురవుతున్న బీసీల కోసం త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపించాలనే ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు. తద్వారా తెలుగుదేశం పార్టీని వీడబోతున్నట్లు సంకేతమిచ్చారు. తెలంగాణ ఉద్యమం తరహాలో బీసీల హక్కులను పాకాడుకునేందుకు జిల్లాల వారిగా బహిరంగ సభలు ఏర్పాటు చేయనున్నట్లు ఆర్‌. కృష్ణయ్య తెలిపారు. ప్రతి జిల్లాలో రెండు లక్షల మంది బీసీలతో సభలు నిర్వహించి బీసీల ఐక్యతను చాటుకుంటామన్నారు. చివరగా రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో 5 లక్షల మందితో భారీ బహిరంగ సభను నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. అసెంబ్లీ, పార్లమెంట్‌లో బీసీలకు తగిన ప్రాధాన్యతను ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకటి రెండు కులాలకు ఏదో చేస్తామని చెప్పకోవడం సరికాదని బీసీ కులాలన్నింటికీ న్యాయం చేకూర్చడానికి రాష్ట్ర బడ్జెట్‌లో రూ. 10 వేల కోట్లు కేటాయించాలని ఆయన డిమాండ్‌ చేశారు. గొల్ల కురుమ యాదవ్‌వులకు గొర్రెల యూనిట్లను మంజూరు చేయడమే కాకుండా మత్స్యకారులను ప్రోత్సహించడం అభినందనీమయే అయినా అన్ని కులాలకు సమ ప్రాధాన్యత కల్పించాల్సిన అవసరం ప్రభుత్వంపై ఉందన్నారు. దేశ జనాభాలో 56 శాతం ఉన్న బీసీలకు చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలని ఆర్‌. కృష్ణయ్య డిమాండ్‌ చేశారు. దేశంలో పేరుకే ప్రజాస్వామ్యం కానీ మెజార్టీ ప్రజలకు ఏ రంగంలోను వాటా లేదని వాపోయారు. దశాబ్దాలుగా అగ్రవర్గాల పాలకులు బీసీలను అణివేశారన్నారు. జాతీయ బీసీ కమిషన్‌కు ప్రధానమంత్రి నరేంద్రమ ఓదీ చట్టబద్ద హోదా కల్పిస్తే ప్రతిపక్ష పార్టీలు దాన్ని రాజ్యసభలో అడ్డుకోవడం శోచనీయమన్నారు. బీసీలు, తెగించి పోరాడి హక్కులు సాధించుకోవాలని పిలుపునిచ్చారు.