"టచ్ చేసి చూడు" సినిమా రివ్యూ

చిత్రం: టచ్ చేసి చూడు
రేటింగ్: 2.5/5.0
బ్యానర్:లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్
సంగీతం : జామ్ 8
దర్శకత్వం : విక్రమ్ సిరికొండ
నిర్మాత: నల్లమలుపు శ్రీనివాస్ (బుజ్జి), వల్లభనేని వంశీ

స్టారింగ్ : రవితేజ, రాశీఖన్నా, సీరత్ కపూర్, సుహాసిని, జయప్రకాష్, వెన్నెల కిషోర్

రెండేళ్ల గ్యాప్ తర్వాత మాస్ మహారాజా గత ఏడాది చివర్లో రాజా ది గ్రేట్ తో వచ్చి సూపర్ హిట్ కొట్టి , ఆ సక్సెస్ ను ఇంకా మరచిపోకముందే ఈరోజు "టచ్ చేసి చూడు" అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. కొత్త డైరెక్టర్ విక్రమ్ సిరి కొండ డైరెక్ట్ చేసిన ఈ చిత్రానికి రవితేజ మరోసారి పోలీస్ లా కనిపించడంతో ఈ సినిమా ఎలా ఉండబోతుందో అని అభిమానుల్లో , ఇటు సినీ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగింది. మరి వారి ఆసక్తి తగినట్లు సినిమా ఉందా లేదా అనేది ఇప్పుడు చూద్దాం..

కథలోకివెళితే...
కార్తికేయ (రవితేజ) ఓ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్..ఒకానొక టైములో ఇతడి ఆవేశం ఫలితం గా ఓ ప్రాణం పోద్ది..దాంతో ఫై అధికారులు కార్తికేయ ను సస్పెండ్ చేస్తారు. దీంతో కార్తికేయ పేరుతో ఓ ఇండస్ట్రీ ఏర్పటు చేసి హ్యాపీ గా తన ఫ్యామిలీ తో గడుపుతుంటాడు. అతడికి పెళ్లి చేయాలని నిర్ణయించుకున్న తల్లితండ్రులు పుష్ప(రాశిఖన్నా) అనే అమ్మాయితో పెళ్ళిచూపులు ఎరేంజ్ చేస్తారు. అమ్మాయిలతో ఎలా మాట్లాడాలో తెలియని కార్తికేయ పెళ్ళిచూపుల్లో అడ్డదిడ్డంగా మాట్లాడి అమ్మాయిని నొప్పిస్తాడు. దీంతో పుష్ప పెళ్ళికి నో చెబుతుంది. పుష్పకు సారీ చెప్పి పెళ్లికి ఒప్పించాలని ప్రయత్నిస్తుంటాడు. అదే టైం లో తన చెల్లెలు ఓ హత్య చూస్తుంది..ఆ విషయాన్నీ కార్తికేయపై చెప్పడం తో పోలీసుల దగ్గర చెప్పించే ప్రయత్నం చేస్తాడు. కానీ ఆ హత్య చేసింది గతం లో తన చేతిలో చనిపోయిన ఇర్ఫాన్ లాలా అని తెలుసుకున్న కార్తికేయ షాక్ అవుతాడు..ఇంతకీ చనిపోయిన వ్యక్తి మళ్లీ ఎలా బ్రతికి వచ్చాడు? అసలు ఇర్ఫాన్ లాలా చనిపోయాడా లేదా? ఆలా ఎందుకు నాటకం ఆడారు అనేది మీరు తెరపై చూడాల్సిందే.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
ఎప్పటిలాగానే రవితేజ తన మార్క్ ఎనర్జీ తో కనిపించాడు..ఇక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా , ఇటు ఓ ఇండస్ట్రీ అధినేత గా కనిపించి అభిమానులను ఆకట్టుకున్నాడు. రాశి ఖన్నా , సీరత్ కపూర్ లు కేవలం గ్లామర్ కే పరిమితం అయ్యారు తప్ప కథలో వీరికి పెద్ద గా ప్రాముఖ్యత లేకుండా పోయింది.

సాంకేతికపరంగా...
ఈ మూవీ కి పెద్ద మైనస్ జామ్ 8 మ్యూజిక్. ఏ సాంగ్ కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. మణిశర్మ అందించిన బ్యాక్ గ్రౌండ్ సినిమాకు కాస్త ప్లస్ గా నిలిచింది. డైలాగ్స్ కూడా పెద్దగా పేల్లేదు.

విశ్లేషణ...
హీరో కు ఫ్లాష్ బ్యాక్ ఉండడం , అది ఇంటర్వెల్ టైం లో బయటకు తెలియడం , ఆ ఫ్లాష్ బ్యాక్ లో హీరో ఏంటి? అంతా ఒక రోటీన్ కథే..డైరెక్టర్ విక్రమ్..మొదటిసారి మెగా ఫోన్ పట్టుకున్నాడు కానీ కథలో కొత్తదనం చూసుకుంటే బాగుండేది. అందరికి తెలిసిన కథనే ఎంచుకొని తప్పు చేసాడు. ఫస్ట్ హాఫ్ అంత కూడా హీరో , హీరోయిన్ మధ్య సాగిపోయే సన్నివేశాలతో సాగదీసాడు. సెకండ్ హాఫ్ లో హీరో కు ఫ్లాష్ బ్యాక్ పెట్టాడు. అదికూడా పెద్దగా వర్క్ అవుట్ కాలేదు. గత ఏడాది రాజా ది గ్రేట్ తో హిట్ ఆదుకున్న రవితేజ..ఈ ఏడాది మొదట్లో టచ్ చేసి చూడు అంటూ వచ్చాడు. కానీ ప్రేక్షకులను టచ్ చేయడం లో విఫలం అయ్యాడనే చెప్పవచ్చు. బి, సి సెంటర్స్‌లో రెస్పాన్స్ బాగుండే అవకాశముంది.

నచ్చినవి...
రవితేజ యాక్టింగ్
రాశిఖన్నా, సీరత్ గ్లామర్ షో
మణిశర్మ బ్యాక్ గ్రౌండ్

నచ్చనివి...
రోటీన్ కథ

చివరగా...
రవితేజ టచ్ మిస్ అయినట్లుంది...