"జై లవ కుశ" సినిమా రివ్యూ

చిత్రం:జై లవ కుశ
రేటింగ్: 2.75/5.0
బ్యానర్: ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకం
దర్శకత్వం: కె.ఎస్.రవీంద్ర (బాబీ)
నిర్మాత: నందమూరి కళ్యాణ్‌రామ్
రచన: బాబీ, కోనా వెంకట్, కె.చక్రవర్తి
సంగీతం: దేవీశ్రీ ప్రసాద్

స్టారింగ్:ఎన్టీఆర్, నివేదా థామస్, రాశీఖన్నా, నందిత, రోనిత్ రాయ్ తదితరులు

ఎన్టీఆర్ తొలిసారి త్రిపాత్రాభినయం చేసిన సినిమా ‘జై లవ కుశ’. ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై నందమూరి కళ్యాణ్ రామ్ నిర్మించిన ఈ సినిమాలో ఎన్టీఆర్ అద్భుతంగా నటించాడని, సినిమా మొత్తం తానై నడిపించాడని అంటున్నారు. ఓవర్సీస్‌లో ఇప్పటికే ఈ సినిమా చూసిన వారు చాలా బాగుందంటూ ట్విట్టర్ ద్వారా స్పందిస్తున్నారు. ఫస్టాప్‌లో కుశ కామెడీ, లవ-రాశీ లవ్ ట్రాక్, ట్రింగ్ ట్రింగ్ సాంగ్, ఇంటర్వల్ బ్యాంగ్ బాగున్నాయని అంటున్నారు. ఇక సెకండాఫ్ అయితే అదిరిపోయిందని అంటున్నారు. ఇంటర్వల్ తరవాత వచ్చిన జై క్యారెక్టర్ సినిమా మరో స్థాయికి తీసుకెళ్లిందట. ఎన్టీఆర్ అభిమానులకు ఇది పండగలాంటి సినిమా అని అంటున్నారు. మరోవైపు తమ హీరో హిట్టుకొట్టడం ఖాయమని ఎన్టీఆర్ అభిమానులు చాలా కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. మరి సినిమా ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
ముగ్గురు అన్నదమ్ములు, విడిపోవడం, కలవడం.. పాత తరహా కథే అయినా ఇందులో చాలా మలుపులూ సరికొత్తగా ఉన్నాయి. అసలు కథలో ఒకే కుటుంబంలో పుట్టిన ముగ్గురు అన్నదమ్ములు , మనుషులు వేరు, రూపం ఒక్కటే. అయితే ఊహించని పరిణామంతో ఆ కుటుంబం చెల్లాచెదురు అవుతుంది. పెద్ద కొడుకు జై కి బాల్యంలో వున్న చేదు జ్ఞాపకాలు అతన్ని కరుడుగట్టిన మనిషిగా మార్చేస్తాయి. లవ కుమార్ మంచితనానికి మారుపేరుగా ఓ బ్యాంకు ఉద్యోగి అవుతాడు. ఇక కుశుడు, చిన్న చిన్న దొంగతనాలతో బతికేస్తుంటాడు. అనుకోకుండా కుశుడు , లవ కుమార్ కలుస్తారు. లవకుమార్ మంచితనం వల్ల ఎదురయ్యే సమస్యల్ని పరిష్కరించడానికి కుశుడు అతని ప్లేస్ లోకి వెళ్ళిపోతాడు. ఇంతలో ఆ ఇద్దరూ ఊహించని దానవత్వంతో జై సీన్ లోకి ఎంటర్ అయిపోతాడు.దాన్ని తొలగించుకోడానికి లవ,కుశ ని ని వాడుకోవాలని డిసైడ్ అయిన జై వారిని కిడ్నాప్ చేయిస్తాడు. అందరూ ఒకే చోటుకి చేరతారు. ఒకరు నిజమైన జై అయితే, ఒకరిని తనని రాజకీయంగా ఎదిగే పనికి ,ఇంకొరికి తాను ప్రేమించే అమ్మాయిని తనకు దగ్గరచేసే పనికి అప్పజెప్పి ఈ అభినవ రావణుడు తన పని పూర్తి కాగానే లవకుశ ని పైకి పంపాలి అనుకుంటాడు. జై మారతాడని లవకుశ ఎదురు చూస్తుంటారు?? మరి జై మారాడా?? అందరు కలిసారా?? అనేది తెరపైనే చూడాలి...

నటీనటులఫర్ఫార్మెన్స్...
ఇది ఎన్టీఆర్ వన్ మాన్ షోని యుననిమస్ టాక్ బయటికి వచ్చింది. కంప్లీట్ గా ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ కోసం ఈ సినిమా అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎన్టీఆర్‌ ఒక్కడే ఈ సినిమాని ముందుండి నడిపించాడు.ఆయన స్త్రెంత్ పై నడిచిన కధ ఇది. తన నటన, డైలాగులు, వినోదం, డాన్సులతో జూనియర్ ఆదరగోట్టేశాడు. తమన్న స్పెషల్ పాట నిజంగానే స్పెషల్. రాశి, నివేద థామస్ కూడా చాలా బాగా వారి వారి పరిధిలో నటించి మెప్పించారు.

సాంకేతికపరంగా...
దేవి శ్రీ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ సినిమాకు హైలైట్ నిలిచాయి.డైరెక్టర్ బాబీ కేవలం ఎన్టీఆర్ ను దృష్టి లో పెట్టుకొని సినిమాను తెరకెక్కించాడు. ఎన్టీఆర్ లోని సరికొత్త నటుడిని పరిచయం చేసాడు. చోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ మరో బలమని చెప్పవచ్చు.

విశ్లేషణ...
ఇది వరకు పాత రోజుల్లో వచ్చిన చిరంజీవి ముగ్గురు మొనగాళ్ళు సినిమాలనే ఉన్నా ఇందులో జై పాత్ర సినిమాకు హైలైట్. ఎన్టీఆర్ లోని సరికొత్త నెగటివ్ కోణం ని ఈ సినిమాలో చూడవచ్చు. ఈ పాత్రను దర్శకుడు బాగా మలిచాడు. ఓవరాల్ గా చూస్తే ఫస్ట్ హాఫ్ అంత లవ , కుశ లతో సరదా సరదా గా కథ సాగిపోతుంది.సెకండ్ హాఫ్ లో జై ఎంట్రీ తో కథ సీరియస్ గా సాగుతుంది. సిమ్రాన్ గా నివేద థామస్ కూడా ఈ సెకండ్ హాఫ్ లోనే వస్తుంది. జై, సిమ్రాన్ ల ప్రేమాయణం బాగా ఆకట్టుకుంది. మొత్తానికి ఎన్టీఆర్ అభిమానులకు దసరాను ముందుగానే తీసుకువచ్చారు అనవచ్చు.

నచ్చినవి...
ఎన్టీఆర్ నటన
దేవి శ్రీ సంగీతం
సినిమాటోగ్రఫీ

నచ్చనివి...
సెకండ్ హాఫ్ లో ఎడిటింగ్

చివరగా...
ఎన్టీఆర్ జై లవకుశ తో దసరాను ఎంజాయ్ చేయండి...