"జైసింహా" సినిమా రివ్యూ

చిత్రం: జైసింహా
రేటింగ్: 2.5/5.0
సంగీతం : చిరంతన్ భట్
దర్శకత్వం : కె ఎస్ రవికుమార్
నిర్మాత: కల్యాణ్

స్టారింగ్ : బాలకృష్ణ, నయనతార, హరిప్రియ, బ్రహ్మానందం, ప్రకాష్ రాజ్, అశుతోష్ రాణా తదితరులు...

నందమూరి బాలకృష్ణకు మాస్‌లో ఫాలోయింగ్ ఎలా ఉంటుందో కొత్తగా చెప్పనవసరంలేదు. ఇలాంటి మాస్ హీరోకి మంచి కమర్షియల్ దర్శకుడు తోడైతే, ఆ కాంబినేషన్ అదిరిపోతుంది. అలాంటి కాంబినేషన్ లో వచ్చే సినిమా కోసం అభిమానులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. అది నేడు సంక్రాంతి కానుకగా ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే బాలయ్య అభిమానులు సినిమా ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ అయితే దాన్ని మించి ఉందని ట్వీట్లు చేస్తున్నారు. సెకండ్ హాఫ్‌లో సెంటిమెంట్, భావోద్వేగాలు బాగా పండాయని, మొత్తంగా ఇది మంచి మూవీ అని మరొకరు ట్వీట్ చేశారు. సెకండాఫ్‌లో రెండు ఎపిసోడ్‌లు అద్భుతంగా ఉన్నాయట. అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ అని అంటున్నారు. రూ.30 కోట్లు పైగా వసూలు చేస్తుందని ఓ ట్విట్టరెట్ ట్వీట్ చేశారు. ఇది పక్కా బాలయ్య షో అట. డ్యాన్సులు, ఫైట్లతో బాలయ్య అదరగొట్టారట. ఈ ఏడాది తొలి హిట్ ‘జైసింహా’ అని, ఇది సంక్రాంతి హిట్టు బొమ్మ అని ట్వీట్లు పెడుతున్నారు."సింహా" సెంటిమెంటుకు తోడు సంక్రాంతి సెంటిమెంటు బాలయ్య బాబుకు బాగనే అచ్చివచ్చిందని అభిమానులు అంటున్నారు.మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందో లేదో రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథలోకివెళితే...
నరసింహ(బాలకృష్ణ) తన బిడ్డను తీసుకొని విశాఖపట్నం నుంచి కుంభకోణంకి వెళ్తాడు. ఏదైనా పని చేసుకొని తన బిడ్డను పెంచాలనుకుంటాడు. అలా వెళ్ళిన నరసింహకు ఆ ఊరి పెద్దతో పరిచయం ఏర్పడుతుంది. ఆయన ఇంట్లోనే నరసింహ పనికి చేరతాడు. కథ ఇలా సాగుతూండగా, ఆ ప్రాంతపు బ్రాహ్మణులతో దురుసుగా ప్రవర్తించాడని ఏసీపీ ప్రతాప్‌తో నరసింహ గొడవ పడతాడు. దీంతో నరసింహను టైమ్ చూసి దెబ్బ కొట్టాలని చూస్తుంటాడు ఏసీపీ. మరోపక్క కనియప్పన్(బాహుబలి ప్రభాకర్) అనే రౌడీ కూడా నరసింహను చంపాలనుకుంటాడు. అసలు నరసింహ ఎవరు? తన సొంతూరుని వదిలేసి కుంభకోణంకి ఎందుకు వస్తాడు? కనియప్పన్, నరసింహను ఎందుకు చంపాలనుకుంటాడు? నయనతార, హరిప్రియల పాత్రలు ఏమిటి? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కి, తన పవర్‌ఫుల్ హావభావాలకి, డైలాగ్ డెలివరీకి తగ్గ పాత్రను డిజైన్ చేశారు. ఆ పాత్రకు ఎమోషన్ కూడా యాడ్ చేయడం సినిమాకు ప్లస్ అయింది. అయితే వయసు పైబడ్డ ఛాయల్ని కవర్ చేయడానికి ఆయన బాగానే కష్టపడ్డారనిపిస్తుంది.నరసింహ పాత్రకు తగిన వేషధారణ పక్కాగా కుదిరింది. అంతేకాకుండా బాలయ్య తన స్టెప్పులతో అదరగొట్టాడు. ‘అమ్మకుట్టి’ పాటలో ఆయన స్టెప్పులకు ఫ్యాన్స్ ఈలలు వేయకుండా ఉండలేరు. విలన్‌గా అశుతోష్ రానా, బాహుబలి ప్రభాకర్‌లు నటనకి వంక పెట్టలేం. నయనతార తన నటనతో ఆకట్టుకుంటుంది. హరిప్రియ తన నటనతో ఆకట్టుకుంది. తన పాత్రకు మంచి ప్రాముఖ్యత ఉంది. బాలయ్య, హరిప్రియల కాంబినేషన్ సీన్స్ ఆకట్టుకున్నాయి. మధ్య మధ్యలో బ్రహ్మానందం కామెడీ సీన్లను ఇరికించడం ప్రేక్షకుడిని కాస్త ఇబ్బంది పెడుతుంది.

సాంకేతికపరంగా...
చిరంతన్ భట్ అందించిన సంగీతం మెప్పిస్తుంది. రెండు పాటలు బాగున్నాయి. నేపథ్య సంగీతంతో చిరంతన్ తన ఉనికి చాటుకున్నాడు. సినిమాటోగ్రఫీ బాగుంది. రొటీన్ కథే అయినప్పటికీ రేసీ స్క్రీన్‌ప్లేతో దర్శకుడు మంచి ఎంటర్‌టైన్మెంట్‌నే అందించారు.

విశ్లేషణ...
బాలకృష్ణ బాడీ లాంగ్వేజ్‌కి, తన పవర్‌ఫుల్ హావభావాలకి, డైలాగ్ డెలివరీకి తగ్గ పాత్రను డిజైన్ చేశారు. ఆ పాత్రకు ఎమోషన్ కూడా యాడ్ చేయడం సినిమాకు ప్లస్ అయింది. ద్వితీయార్ధంలో బాలకృష్ణ చెలరేగిపోయాడు. ఫ్యాన్స్‌ను ఉర్రూతలూగించే సన్నివేశాలు, మాస్ వెర్రెత్తిపోయే సంభాషణలు బాగా పడ్డాయి. ఈ సినిమా మాత్రం ఒక ఎమోషనల్ జర్నీ. సినిమా ఫస్ట్‌హాఫ్ మొత్తం రొటీన్ స్క్రీన్‌ప్లే‌తో రెగ్యులర్ కామెడీతో సాగింది. అసలు కథ సెకండ్‌హాఫ్‌లో మొదలవుతుంది. నయనతార పాత్ర ప్రవేశించినప్పటి నుంచి సినిమా ఎమోషనల్‌గా సాగుతుంది. పతాక సన్నివేశాలు అభిమానులను ఆకట్టుకుంటాయి.

నచ్చినవి...
బాలయ్య బాబు
నయనతార

నచ్చనివి...
రోటీన్ కథ
కామెడీ

చివరగా...
సంక్రాంతికి మంచి మాస్ విందు ఈ సినిమా