జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ!!

జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీ ,సోషల్‌ మీడియాలో హల్‌చల్‌

ఆంధ్రప్రదేశ్‌లో జూనియర్‌ ఎన్టీఆర్‌ పొలిటికల్‌ ఎంట్రీపై సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ నడుస్తోంది. ప్రెసిడెంట్‌గా ఓ రాజకీయ పార్టీ పురుడు పోసుకుందన్న వార్తలు నెట్‌లో వైరల్‌ అవుతున్నాయి. దానికి సంబంధించి నవభారత్‌ నేషనల్‌ పార్టీ - భద్రతే మా లక్ష్యం, మానవతే మా నినాదం పేరిట ఓ లేఖ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ఎన్టీఆర్‌ను నవభారత్‌ నేషనల్‌ పార్టీ ఏపీ అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఓ లెటర్‌ విస్తృతంగా సర్క్యులేట్‌ అవుతోంది. అది 2009 ఎన్నికల టైం. టిడిపి తరఫున జూనియర్‌ ఎన్టీఆర్‌ విస్తృతంగా ప్రచారం చేశారు. పార్టీ గెలుపు కోసం తన తాత నందమూరి తారక రామారావునే అనుసరించారు. ఖాకీ దుస్తుల్లో అనేక గ్రామాలు, పట్టణాల్లో తిరిగి ప్రచారం చేశారు. ఆ క్రమంలో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. ఆ తర్వాత ఏమైందో ఏమో కానీ, పార్టీ కార్యకలాపాలకు దూరమయ్యాడు తారక్‌. అయితే ఆ లెటర్‌ వట్టి లెటరేనని అంటున్నారు. ఫోటోషాప్‌లో ఎవరో కావాలని లెటర్‌ను సృష్టించారని చెబుతున్నారు. కానీ అవేవీ పట్టించుకోకుండా ఆ లెటర్‌ను ఒకరితర్వాత ఒకరు షేర్‌ చేయడంతో ఈ లెటర్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోందని చెబుతున్నారు. కనీసం అందులో ఉన్నది వాస్తవాలేనా అనైనా తెలుసుకోకుండా షేర్‌ చేస్తున్నారని ఫిల్మ్‌నగర్‌ వర్గాలు అంటున్నాయి. ప్రస్తుతం జైలవకుశ చిత్రం షూటింగ్‌లో బిజీగా ఉన్న తారక్‌, ఈ రాజకీయ లెటర్‌పై ఏవిధంగా స్పందిస్తారో మరి!!