"జవాన్" సినిమా రివ్యూ

చిత్రం: జవాన్
రేటింగ్: 2.5/5.0
సంగీతం : తమన్
దర్శకత్వం : భ్వ్శ్ రవి
నిర్మాత: దిల్ రాజు, కృష్ణ

స్టారింగ్ : సాయి ధరమ్‌ తేజ్‌, మెహ్రీన్‌, ప్రసన్న, జయప్రకాష్, ఈశ్వరీ, సత్యం రాజేష్ తదితరులు...

తిక్క’, ‘విన్నర్’ ఇలా వరుసగా రెండు ఫ్లాప్ సినిమాలతో మెగా హీరో సాయి ధరం తేజ్ డీలా పడ్డాడు. తను అతిథి పాత్ర చేసిన ‘నక్షత్రం’ కూడా ఆశించిన స్థాయిలో ఆడలేదు.తొలి సినిమా వాంటెడ్ ప్లాప్ తర్వాత బాగా టైం తీసుకుని రవి జవాన్ కథతో సాయి ధరమ్ తేజ్ ని ఒప్పించాడు. ఆ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన జవాన్ సినిమా కి ప్రముఖ దర్శకుడు దిల్ రాజు సమర్పకుడిగా వ్యవహరించడం విశేషం. దీంతో ఇప్పుడు ‘జవాన్’ సినిమాపైనే ఆశలు పెట్టుకున్నాడు. ‘జవాన్’ సినిమా విజయంపై తేజు చాలా కాన్ఫిడెంట్‌గా కనిపించాడు. దీంతో సినిమా మీద బాగా ఆసక్తి నెలకొంది. మరీ జవాన్ ఎలా వుందో ఈ రివ్యూలో చూద్దాం..

కథలోకివెళితే...
జై(సాయి ధరం తేజ్)కు చిన్నప్పటి నుంచి దేశభక్తి చాలా ఎక్కువ. బాధ్యత గల వ్యక్తిత్వం గలవాడు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎస్ఎస్)లో మెంబర్‌గా ఉంటాడు. డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో)లో ఉద్యోగం సంపాదించాలనేది అతడి కోరిక. మరోపక్క కేశవ్(ప్రసన్న) హైటెక్ క్రిమినల్. ఉగ్రవాద దాడులకు పాల్పడుతుంటాడు. అనుకోకుండా ఆ టెర్రరిస్ట్ గ్యాంగ్‌ను ఎదుర్కొని దేశానికి నష్టం జరగకుండా కాపాడతాడు జై. దీంతో జై మీద కేశవ్ పగ పడతాడు.జై కలలు కంటున్న ఉద్యోగం తృటిలో తప్పిపోయిన ద్ర్దొ అత్యంత అధునాతనమైన ఓ మిస్సైల్ వెహికల్ ఆక్టోపస్ ని కనిపెడుతుంది. అతి తక్కువ బరువుతో ఓ మనిషితో పాటు తీసుకెళ్లగలిగే ఈ ఆక్టోపస్ ని సొంతం చేసుకోడానికి కేశవ్ కి 500 కోట్లు ఆశ చూపుతారు. ఆ డీల్ ని ఓకే చేసిన కేశవ్ దాన్ని సాధించే క్రమంలో జై అడ్డు పడతాడు. దీంతో జై తోనే ఆక్టోపస్ తెప్పించడానికి కేశవ్ ఏమి చేసాడు, జై తన దారి తప్పకుండా ఆక్టోపస్ ని, సొంత కుటుంబాన్ని ఎలా రక్షించుకున్నాడు అన్నదే మిగిలిన కథ.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
సాయి ధరమ్ తేజ్ నటనలో చాలా పరిణితి కనిపించింది.ఇక విలన్ గా కనిపించిన ప్రసన్న అదరగొట్టాడు. తెలుగు తెరకు ఈ సినిమాతో మంచి విలన్ దొరికినట్టే. హీరోయిన్ మెహ్రీన్ పాటలకే పరిమితం అనుకున్నా వున్న కాసేపు తన గ్లామర్, యాక్షన్ తో మెప్పించింది. జై కుటుంబసభ్యులుగా చేసిన వాళ్ళు బాగానే చేసారు. పిల్లల పాత్రలు కూడా బాగున్నాయి.

సాంకేతికపరంగా...
టెక్నికల్‌గా మంచి క్వాలిటీతో సినిమాను రూపొందించారు. తమన్ అందించిన పాటలు, నేపథ్య సంగీతం ఆకట్టుకుంటాయి. గుహన్ అందించిన సినిమాటోగ్రఫీ సినిమా స్థాయిని పెంచింది. పాటల్లో విజువల్స్ బాగున్నాయి. ఎడిటింగ్ వర్క్ పర్వాలేదనిపిస్తుంది.

విశ్లేషణ...
దేశం, కుటుంబం కోసం తాపత్రయ పడే ఒక మధ్యతరగతి యువకుడి కథే ఈ ‘జవాన్’. అయితే దర్శకుడు బీవీఎస్ రవి రాసుకున్న కథలో ఎక్కడా కొత్తదనం కనిపించదు. హీరో, విలన్ మధ్య సన్నివేశాలను కూడా ఆసక్తికరంగా రాసుకోలేకపోయారు. వారిద్దరి మధ్య సాగే మైండ్ గేమ్ అంత ఇంట్రస్టింగ్‌గా లేదు. దర్శకుడిగా కంటే రైటర్‌గా ఆయన రాసుకున్న సంభాషణలు ఆకట్టుకుంటాయి. దేశభక్తి గురించి వివరించే సన్నివేశాలు, ఎమోషనల్ సీన్స్ ఆడియన్స్‌కు బాగా కనెక్ట్ అవుతాయి. హీరో పాత్రను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. అయితే ఆశించిన స్థాయిలో సినిమాను రక్తి కట్టించలేకపోయారు.

నచ్చినవి...
సాయి ధరమ్ తేజ్ నటన
మెహ్రీన్ గ్లామర్

నచ్చనివి...
రోటీన్ కథ

చివరగా...
రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లో "జవాన్" ఒకటి