చైనాను దాటిన భారత్‌!

ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం ఏదీ? అంటే కొన్ని సంవత్సరాలుగా నిర్ద్వందంగా చైనా అని సమాధానం చెబుతున్నాం. కాని ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం చైనా కాదంటూ షాక్‌ ఇచ్చాయి పుక్సియన్‌ అనే పరిశోధకుడు. ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశం భారత అని ఆయన చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్‌ విస్సోన్సిన్‌, మాడిసన్‌ రీసెర్చర్‌ అయిన ఈ పుక్సియన్‌.. చైనాలోని పెకింగ్‌ విశ్వవిద్యాలయంలో ఓ కార్యక్రమానికి అతిథిగా హాజరై ప్రసంగించారు. చైనా అధికారిక జనాభా లెక్కలు తప్పుడువని సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం భారతే ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశమని అభిప్రాయపడాడరు. ఇందుకు కొన్ని లెక్కలను కూడా చెప్పారు. 1991 నుంచి 2016 వరకు చైనాలో 377.6 మిలియన్ల జనాలు నమోదు అయ్యాయి. కానీ, రికార్డుల్లో మాత్రం ఇదే కాలంలో 464.8 మిలియన్ల జననాలు జరిగినట్లు ఉంది. దీన్ని బట్టి ప్రస్తుతం చైనా జనాభా 1.38 బిలియన్లు కాదని తేలిపోతుందని చెప్పారు. పుక్సియన్‌ ప్రకటనను చైనాకుపలు మీడియా సంస్థలు ప్రముఖంగా ప్రచురించాయి. ఇందుకు కారణం చైనాను భారత్‌ జనాభాలో దాటిస్తే చైనా వృద్దిరేటు అమాంతం పడిపోయే అవకాశం ఉంది. ఐక్యరాజ్యసమతి అంచనాల ప్రకారం 2022 కల్లా భారత్‌ ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా అవతరించాలి. ఈ విషయాన్ని 2013లోనేత పుక్తకం బిగ్‌ కంట్రీ విత్‌ యాన్‌ ఎంప్టీ నెప్ట్‌లో ప్రస్తావరించినట్లు పుక్సియన్‌ తెలిపారు. 2003 నుంచి ఇలా చైనా అధికారిక రికార్డుల్లో జనాభా లెక్కలు తప్పుగా వస్తున్నాయని తాను గ్రహించినట్లు వెల్లడించారు.