చైతన్య-సమంతల పెళ్ళి ఫోటోలు...

ఇంత కాలం ప్రేమ పక్షులాగా తమ ప్రేమను పంచుకున్న సమంత , నాగ చైతన్యలు గత రాత్రి నుండి భార్య భర్తలు అయ్యారు. సరిగ్గా రాత్రి 11.52 నిమిషాలకు కుటుంబ సభ్యుల సమక్షం లో వీరు ఒకటయ్యారు. నిన్న హిందూ సంప్రదాయం లో వీరి వివాహం జరుగగా , ఈరోజు క్రైస్తవ పద్ధతి ప్రకారం వివాహం జరగనుంది.. అంటే నాగ చైతన్య , సమంతల పెళ్లి రెండోసారి జరగబోతుందన్నమాట.

గోవాలో బీచ్ పక్కన ఓపెన్ టాప్ లో చిన్నచిన్న టెంట్లు వేసి స్టయిలిష్ గా పెళ్లి చేశారు. ఓవైపు పెళ్లి సంప్రదాయబద్దంగా జరిగినా.. అతిథి సత్కారాలు మాత్రం వెస్ట్రన్ టైపులో సాగిపోయాయి. అంటే ఎంజాయ్ చేసేవాళ్లు చేయొచ్చు.. పెళ్లి చూడాలనుకునేవాళ్లు చూడొచ్చన్నమాట. ఇప్పటికే పెళ్లి కి సంబదించిన పిక్స్ సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి. ఈరోజు రాత్రితో నాగచైతన్య-సమంత 2 రోజుల పెళ్లి వేడుకలు ముగుస్తాయి. హైదరాబాద్ తిరిగొచ్చిన తర్వాత రిసెప్షన్ తేదీని ప్రకటిస్తారు.