చీకటి

గదిలో చీకటి నిశ్శబ్దంగా అలుముకుంది...

చీకటికి మాటలు రావు కానీ------- నిశ్శబ్దంగా చూస్తుంది
చీకటికి మాటలు రావు ---------వచ్చివుంటే

అది వెలుగుతో ఇలా అని ఉండేది

" ఓ వెలుగా!! మనుషులందరూ కళ్ళముందు నిన్ను కోరుకుంటున్నారని మిడిసిపడకు...
వాళ్ళ మనస్సుల్లో నేను నిరంతరం ఉంటూనే ఉంటాను కదా!! అందుకే లేని నీ కోసం నిత్యం తపన పడుతున్నారు.అది మనిషి సహజ లక్షణం "