చరణ్‌, ఎన్టీఆర్‌ కాదు రామ్‌ అయినా ఖరారేనా...??

మళయాలీ ముద్దుగుమ్మ అనుపమ పరమేశ్వరన్‌ వరుసగా మూడు చిత్రాలతో మంచి విజయాలను అందుకుంది. ఈ అమ్మడికి సక్సెస్‌ హీరోయిన్‌ అనే పేరు కూడా వచ్చింది. అలాంటి అనుమమకు చరణ్‌, సుకుమార్‌ల చిత్రంలో నటించే అవకాశం వచ్చి పలు కారణాల అది ఖరారు కాలేదు. ఆ తర్వాత బాబీ, ఎన్టీఆర్‌ చిత్రంలో వచ్చినట్టే వచ్చి ఆ అవకాశం కూడా మిస్‌ అయ్యింది. ఇక వచ్చిన రెండు పెద్ద హీరోల అవకాశాలు ఖరారు కాకపోవడంతో అనుపమ చాలా నిరాశ పడిరది. అయితే త్వరలో ఈ అమ్మడికి మహేష్‌ వచ్చే అవకాశం ఉందని ఫిల్మ్‌ నగర్‌లో టాక్‌ వినిపిస్తోంది.

మహేష్‌, కొరటాల చిత్రంలో అనుపమను తీసుకోవాలనే ఫిక్స్‌ అయిన దర్శకుడు కాస్త ఈమె హైట్‌ గురించే ఆలోచిస్తున్నాడట. పొట్టిగా ఉన్న అనుపమ మహేష్‌ పక్కన సూట్‌ అవుతుందా..?? అని ఆలోచనలో పడ్డాడు. తాజాగా అనుపమకు ఒక ఛాన్స్‌ వచ్చింది. ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ మరియు కిషోర్‌ తిరుమల కాంభోలో తెరకెక్కనున్న చిత్రంలో అనుపమ దాదాపు ఖరారు అయినట్టే అని సమాచారం అందుతోంది. చేతిలో సినిమాలు లేకపోవడంతో రామ్‌కు కూడా అనుపమ ఒకే చెప్పినట్టు తెలుస్తోంది.