చంద్రబాబు మీకు దమ్ముంటే అలా చేయలి

వైకాపా ఎమ్మెల్యే రోజా ఎప్పటికప్పుడు ప్రభుత్వాన్ని తనదైన రీతిలో విమర్శిస్తూ నేతలకు చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఈమె చేసే ఘాటు వ్యాఖ్యలకు గాను ఏడాది పాటు సస్పెన్షన్‌ వేటు కూడా పడిరది. తాజాగా ఆ సస్పెన్షన్‌ వేటు పూర్తి అయ్యింది. కాగా నేడు ఏడాది తర్వాత అసెంబ్లీలో తన గళం వినిపించింది. అనంతరం మీడియాతో మాట్లాడిన రోజా ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడానికి చంద్రబాబు ఏకంగా 300కోట్లు ఖర్చు చేసి వైకాపా నేతలను కొని విజయం సాధించాడు. అసలు ఇది ఒక గెలుపేనా..?? అంటూ బాబుపై ఫైర్‌ అయ్యింది. డబ్బులతో విజయం సాధించిన బాబు స్వంతంగా గెలిచినంత బిల్డప్‌ ఇస్తున్నాడు అని రోజా ఘాటుగా వ్యాఖ్యానించింది.

వైకాపా నేతలందరికి డబ్బులు ఆశ చూపి తమ ప్రభుత్వంలోకి లాగేసుకుంటూ ప్రభుత్వాన్ని నడుపుతున్న చంద్రబాబు గారు మీకు నిజంగా దమ్ము ఉంటే మీ పార్టీలోకి వచ్చిన వైకాపా నేతలందరిని రాజీనామ చేయించి మళ్లీ పోటీలోకి దించండి. అప్పుడు ఎవరు గెలుస్తారు అనేది చూద్దాం అంటూ సవాల్‌ విసిరింది. మీకు నిజంగా దమ్ము ఉంటే అలా చేయల్సిందే అని డిమాండ్‌ చేసింది. తనదైన వ్యాఖ్యలతో చురకలు తగిలించే రోజా ఈసారి కూడా చంద్రబాబుకు గట్టి షాకిచ్చేలా ఘాటుగా మాట్లాడిరది.