చంద్రబాబు ఇది ఒక గెలుపేనా..??

తాజాగా జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెదేపాదే అగ్ర స్థానంగా నిలిచింది. దాంతో అధికార పార్టీ వారు ఆనందంలో మునిగి తేలుతుంటే విపక్షాలు మాత్రం నానా రచ్చ చేస్తున్నారు. సమావేశాల అనంతరం మీడియాతో మాట్లాడిన జగన్‌ ఓడిపోయిన ఆవేశంలో చంద్రబాబుపై నిప్పులు చెరిగారు. మా పార్టీ నేతలను కొని గెలిచావు అసలు ఇది ఒక గెలుపేనా..?? అంటూ ఆరోపించాడు. డబ్బులను చూపి కాకుండా నిజాయితిగా గెలిస్తేనే దాన్ని గెలుపు అంటారు. కానీ ఇలా అప్రజాస్వామ్యంగా డబ్బులతో మనుషులను కొని గెలిస్తే దానిని గెలుపు అంటారా..? జగన్‌ మండి పడ్డారు.

సమావేశంలో మాట్లాడిన జగన్‌ సర్కార్‌పై నిప్పులు చెరిగారు. బడ్జెట్‌లో కేటాయించ విధంగా ఖర్చు చేయకుండా ఖర్చు చేసినట్టు డబ్బాలు కొట్టుకుంటారు. ఆయన ఎమ్మెల్యేలను, ఎమ్మెల్సీలను కొనడానికే అధిక డబ్బును ఉపయోగిస్తాడు అని జగన్‌ బాబుపై విమర్శలు చేశాడు. జగన్‌తో పాటు పలువురు వైకాపా నేతలు కూడా తెదేపా గెలిచిన విధానంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏకంగా వంద కోట్లను వెచ్చించి మరీ వైకాపా నేతలను కొన్నారు అంటూ తెదేపా ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారు.