గుండు హనుమంతరావు మృతి తీరని లోటు

తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్యనటుడిదీ ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావుగారు సైతం తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను. నా వంతు సాయం అందించాను. పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించాను. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. గుండు హనుమంతరావు గారి మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయింది. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను.

‘తెలుగు చిత్రసీమలో ప్రతి హాస్యనటుడిదీ ఒక్కో శైలి. అలానే గుండు హనుమంతరావు తనదైన శైలితో కోట్లాది తెలుగు ప్రేక్షకులకు మూడు దశాబ్దాలుగా వినోదాన్ని అందిస్తూ వచ్చారు. ఆ మధ్య ఆయన అనారోగ్యానికి గురయ్యారని తెలిసి కలత చెందాను. నా వంతు సాయం అందించాను. పరిపూర్ణ ఆరోగ్యంతో ఆయన తిరిగి సినిమాల్లో నటిస్తారని భావించాను. కానీ ఇంతలోనే ఈ దుర్వార్త వినాల్సి వచ్చింది. గుండు హనుమంతరావు మృతితో తెలుగు సినిమా రంగం మంచి నటుడినే కాదు, చక్కని మనిషినీ కోల్పోయింది. ఆయన ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని, వారి కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను’ అని చిరంజీవి ఒక ప్రకటనలో తెలిపారు.

గుండు హనుమంతరావు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారని, వైద్యం చేయించుకోవడానికి డబ్బుల్లేక ఇబ్బంది పడుతున్నారని తెలుసుకున్న చిరంజీవి రూ.2 లక్షలు అందజేశారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో స్వయంగా గుండు హనుమంతరావుతో చిరంజీవి ఫోన్‌లో మాట్లాడి యోగ క్షేమాలు అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం సైతం గుండు హనుమంతరావుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. కానీ ఇవేమీ ఆయన ప్రాణాలను కాపాడలేకపోయాయి. తీవ్ర అస్వస్థతో (ఫిబ్రవరి 19 తెల్లవారుజామున గుండు హనుమంతరావు కన్నుమూశారు. ఆయన ఒక కొడుకు ఉన్నారు.