కృష్ణ ఆవిష్కరించిన కృష్ణ మహేష్ ల ఆనంద భవనం

అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవం సందర్బంగా విశాఖ పట్టణంలో ప్రముఖ నటుడు సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ ల అభిమానుల ఆధ్వర్యంలో అచ్యుతాపురం లోని ఇంటిగ్రేటెడ్ వికలాంగుల పాఠశాలలో నిర్మించిన సూపర్ స్టార్ కృష్ణ - మహేష్ ల ఆనందం భవనం ను కృష్ణ ఆవిష్కరించారు. ఆదివారం అయన నివాసంలో ఈ కార్యక్రమంలో పలువురు కృష్ణ అభిమానులు పాల్గొన్నారు. అనంతరం కృష్ణ మాట్లాడుతూ .. ఇలాంటి కార్యక్రమాలను తన అభిమానులు చేపట్టడం చాలా ఆనందంగా ఉందని అయన అన్నారు. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని చేయాలనీ, తద్వారా సమాజానికి సేవ చేస్తూ భావితరాల వారికి ఆదర్శనంగా నిలవాలని కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ నటి, దర్శకురాలు విజయ నిర్మలతో పాటు పలువురు సీనియర్ కృష్ణ - మహేష్ అభిమానులు కూడా పాల్గొన్నారు.