
ముద్దుగుమ్మ లావణ్యత్రిపాఠి చిన్న చిత్రాలలో నటిస్తూ పెద్ద విజయాలను అందుకుంటూ దూసుకుపోతుంది. ఈ అమ్మడు ఇప్పుడిప్పుడే చాలా జోషుగా విజయాలను అందుకుంది. లావణ్య ప్రస్తుతం శర్వానంద్ సరసన ‘రాధ’ చిత్రంలో నటిస్తోంది. ఈచిత్రం వచ్చే నెలలో ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఈ చిత్రంలో లావణ్య ఇదివరకటి లాగా కాకుండా చాలా అందంగా కనిపించనుందట. ఈమె గత చిత్రాలలో చాలా పద్దతిగా కనిపింపించింది. కానీ ‘రాధ’ చిత్రంలో మాత్రం ఈ చిన్నది అందాలను బాగా ఆరబోసిందట.
తనను గ్లామర్‌గా చూడాలని కు అభిమానులు తెగ కోరుకుంటున్నారని, ఆ విషయం తనకు ఇటీవలె తెల్సిందని అందుకే కుర్రాళ్ల కోసం లావణ్య చాలా గ్లామర్‌గా కనిపించడానికి గ్లామర్ లెవల్స్ పెంచి అందంగా కనిపించడానికి రెడీ అయ్యి ‘రాధ’ చిత్రంలో అందాలను ఓ రేంజ్లో ఆరబోసిందని సమాచారం. ‘రాధా’ చిత్ర ట్రైలర్లో కూడా లావణ్య అందాలు అదిరిపోయాయి. ఇక సినిమా మొత్తంలో కూడా లావణ్య అందాలు అలాగే ఉండే కుర్రకారుని మతిపోగొట్టే విధంగా ఉంటాయని లావణ్య సన్నిహితులు చెబుతున్నారు. లావణ్య హాట్‌గా కనిపించనుందని అని తెలియగానే అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.