కాజల్ అగర్వాల్ కన్ఫర్మ్ !!

ఇప్పటివరకూ స్టార్ డైరెక్టర్లతో కలిసి సినిమాలు చేస్తూ కథానాయకుడిగా తన స్టార్ డమ్ ను పెంచుకొన్న బెల్లంకొండ శ్రీనివాస్ మొదటిసారిగా ఓ కొత్త దర్శకుడైన శ్రీనివాస్ నిర్దేశకత్వంలో వంశధార క్రియేషన్స్ బ్యానర్ పై ఓ సినిమా చేయనున్నాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో మొదటి షెడ్యూల్ జరుపుకొంటున్న ఈ చిత్రంలో కథానాయికగా టాప్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను ఫైనల్ చేశారు. ఆల్రెడీ బాలీవుడ్ ఆర్టిస్ట్ నీల్ నితిన్ ముఖేష్ ఈ చిత్రంలో ముఖ్యపాత్ర పోషిస్తుండడం విశేషం.

ఈ సందర్భంగా వంశధార క్రియేషన్స్ అధినేత నవీన్ శొంటీనేని (నాని) మాట్లాడుతూ.. "బెల్లంకొండ శ్రీనివాస్ ను సరికొత్తగా ప్రెజంట్ చేయనున్నాం. మంచి థ్రిల్లర్ గా తెరకెక్కనున్న ఈ చిత్రం కోసం శ్రీనివాస్ అద్భుతమైన కథ సిద్ధం చేసుకొన్నాడు. బెల్లంకొండ శ్రీనివాస్ సరసన ఈ చిత్రంలో కథానాయికగా క్రేజీ లేడీ కాజల్ అగర్వాల్ కనువిందు చేయనుంది. నెక్స్ట్ షెడ్యూల్ నుంచి ఆమె షూటింగ్ లో భాగస్వామ్యం కానుంది. అబ్బూరి రవి, ఛోటా కె.నాయుడు, ఎస్.ఎస్.తమన్, ఛోటా కె.ప్రసాద్, స్టన్ శివ లాంటి సీనియర్ & టాలెంటెడ్ టెక్నీషియన్స్ వర్క్ చేస్తున్న ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ కూడా భాగస్వామి అయ్యాడు. ప్రస్తుతం హైద్రాబాద్ లో మొదటి షెడ్యూల్ జరుగుతోంది" అన్నారు.

ఈ చిత్రానికి ప్రొడక్షన్ కంట్రోలర్: గణేశుని వెంకటేశ్వర్రావు, కో-డైరెక్టర్: కె.పుల్లారావు, ఫైట్స్: స్టన్ శివ-వెంకట్, పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్, మాటలు: కేశవ్ పప్పల, ఎడిటర్: ఛోటా కె.ప్రసాద్, ఆర్ట్: చిన్నా, సంగీతం: తమన్.ఎస్, ఛాయాగ్రహణం: ఛోటా కె.నాయుడు, నిర్మాణం: వంశధార క్రియేషన్స్, నిర్మాత: నవీన్ శొంటీనేని (నాని), కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: శ్రీనివాస్.