"ఒక్కడు మిగిలాడు" సినిమా రివ్యూ

చిత్రం: ఒక్కడు మిగిలాడు
రేటింగ్: 2.0/5.0
సంగీతం : శివ నందిగామ
దర్శకత్వం :అజయ్ ఆండ్రూస్
నిర్మాత: లక్ష్మీ కాంత్ , ఎస్.ఎన్.రెడ్డి

స్టారింగ్ : మంచు మనోజ్, రెజీనా, అనిషా ఆంబ్రోస్, జెన్నీఫర్, సుహాసిని, మిలింద్ గునాజి తదితరులు

మంచు మనోజ్ ఎల్‌.టి.టి.ఇ. ప్ర‌భాక‌ర‌న్ పాత్ర‌లో నటించిన ప్రయోగాత్మక చిత్రం 'ఒక్క‌డు మిగిలాడు'.మనం భారత దేశ పౌరులం కాక.. ఈ దేశ పౌరులం కాక మరి మనం ఎక్కడి పౌరులం? మన దేశమేది అంటూ ఉగ్రరూపాన్ని చూపించేశాడు మనోజ్. మొత్తానికి ‘ఒక్కడు మిగిలాడు’ చిత్రంతో మంచు మనోజ్ మరోసారి భళా అనిపించాడో లేదో ఈ రివ్యూలో చూద్దాం...

కథలోకివెళితే...
సూర్య(మంచు మనోజ్) యూనివర్సిటీలో చదువుకునే స్టూడెంట్. శరణార్థుడైన అతడిని ఒక కాలనీ వారు చేరదీసి పెంచుతారు.విద్యార్థులతో పాటు వివిధ సామాజిక సమస్యలపై అతను పోరాడుతుంటాడు. ఎక్కడ తప్పు జరిగినా ప్రశ్నించే తత్వం అతనికి ఉంటుంది. దాని వల్లే ఎన్నో సమస్యలు ఎదురవుతుంటాయి. అయితే అదే కాలనీకి చెందిన ముగ్గురు అమ్మాయిలను మంత్రి కొడుకులు అత్యాచారం చేయాలనుకుంటారు. దిక్కుతోచని పరిస్థితుల్లో ఆ ముగ్గురు అమ్మాయిలు పురుగులమందు తాగి చనిపోతారు. ఈ విషయం తెలుసుకున్న సూర్య వారికి న్యాయం జరగాలని పోరాటానికి దిగుతారు. అయితే పోలీసులు సూర్యను అరెస్ట్ చేసి చిత్రహింసలు పెడతారు. అతనిలోని ఈ పోరాట నైజం ఎక్కడ నుంచి వచ్చింది ? అసలు అతను ఎవరు ? ఎక్కడివాడు అనే ప్రశ్నలకి సమాధానంగా శ్రీలంకలో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ మొదలవుతుంది. ళ్ట్టే ఉద్యమం నాటి పరిస్థితులు, ఉద్యమ నేత ప్రభాకరన్ ( మనోజ్ ) జీవిత నేపథ్యంలో కధ మొదలు అవుతుంది. ప్రభాకరన్ కి, విద్యార్థి నేతకి వున్న బంధం ఏమిటి చివరకు ఈ పోరాట పంధా ఎక్కడికి దారి తీసింది అన్నదే ఒక్కటే మిగిలాడు సినిమా.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
పీటర్ అనే పాత్రలో చాలా లావుగా కనిపించాడు. రెండు పాత్రల్లో తేడాను చూపించడానికే మనోజ్ బరువు పెరిగినట్లు అనిపిస్తోంది. ఇక సూర్య పాత్రలో ఓకే అనిపించాడు.మనోజ్. డైలాగ్స్, బాడీ లాంగ్వేజ్ విషయంలో ఈ సినిమాలో ఓ కొత్త మనోజ్ కనిపిస్తాడు. ఇన్నాళ్లు హీరో గా మాత్రమే వున్న మనోజ్ ఈ సినిమాతో నటుడిగా ఒక్కసారిగా నాలుగు మెట్లు ఎక్కాడు. అనీషా ఆంబ్రోస్ ఉన్నంతలో ఓకే అనిపించింది.ఇక సినిమాకు దర్శకత్వం వహించిన అజయ్ కూడా విక్టర్ అనే పాత్రలో నటించాడు. సినిమాలో హీరో కంటే ఈ పాత్రకు కాస్త వెయిట్ ఎక్కువుందని చెప్పాలి. నటుడిగా ఆడియన్స్‌ను మెప్పించినప్పటికీ దర్శకుడిగా మాత్రం ఫెయిల్ అయ్యాడు.

సాంకేతికపరంగా...
డాక్యుమెంటరీ చేయాల్సిన కథతో రెండున్నర గంటల సినిమా చేయడమనే ఆలోచనే ప్రేక్షకుణ్ని ఆలోచనలోకి నెట్టేస్తుంది. ఒక వీరుడు కథను తెరపై చూపిస్తాడేమో, తెలియని విషయాలు తెలుసుకోవచ్చేమో అనుకుని థియేటర్‌కు వెళ్లిన ప్రేక్షకుడికి నిరాశ తప్పదు.నేపథ్య సంగీతం ఆకట్టుకుంటుంది. చాలా వరకు సినిమాను సాగదీశారు.

నచ్చినవి...
సబ్జెక్టు
మనోజ్
బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్

నచ్చనివి...
స్క్రీన్ ప్లే
ఎడిటింగ్

చివరగా...
సాధారణ ఫ్రేక్షకుడికి ఒక్కడే ఎందుకు మిగిలాడో అర్ధంకాదు!!!