ఎస్సీ, ఎస్టీలకు చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు!!

ఎస్సీ, ఎస్టీలకు జరగాల్సిన న్యాయం జరగడం లేదు: టీడీపీ ఎంపీ శివప్రసాద్‌

అంబేద్కర్‌ జయంతి సభలో చిత్తూరు టీడీపీ ఎంపీ శివప్రసాద్‌ తమ ప్రభుత్వంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ జనాభాలో 25 శాతం ఉన్న ఎస్సీ, ఎస్టీలకు జరగాల్సిన న్యాయం జరగడం లేదని, ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం చేస్తున్నారంటూ విరుచుకుపడ్డారు. ఐదు మంత్రి పదవులు ఇవ్వాల్సిన ఉన్న రెండు పదవులిచ్చి చేతులు దులుపుకున్నారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి రెండు మంత్రి పదవులు ఇస్తే వాటినీ ఓసీలకే ఇచ్చారన్నారు. డిప్యూటీ సీఎం బీసలకు ఇచ్చారు. ఎస్సీ, ఎస్టీలను మాత్రం దూరంగా పెడుతున్నారంటూ దుయ్యబట్టారు. మేనిఫోస్టలో 90 శాతం హామీలు నెరేవర్చినట్టుగా చెప్పుకుంటున్న ప్రభుత్వం ఆ మిగిలిన 10 శాతం హామీలు మాట, మాదిగలవా అంటూ ప్రశ్నించారు. దళితులకు చెందిన భూములను లాక్కుంటూ పట్టించుకోకపోవడం, పరిహారం ఇవ్వకపోవడం సమంజసం కాదన్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ భూములు తీసుకుని భూ యజమానులను శ్రామికులుగా మారుస్తున్నారని, ప్రభుత్వ భూములు కబ్జా అయినా పట్టించుకోవట్లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఆ భూముల్లో దళితులుంటే ఖాళీ చేయాలని నోటీసులిస్తారు. ఇదెక్కడి న్యాయం దళితులకో న్యాం, పైవర్గాలకో న్యాయమా అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్కాలర్‌షిప్‌లు కట్‌ చేశారు. దళితులు ఉన్న చదువుకు చదువకోవద్దా? బ్యాక్‌లాగ్‌ ఉద్యోగాలు ఎప్పుడు భర్తీ చేస్తారో తెలపాలంటూ డిమాండ్‌ చేశారు. దళితుల సబ్‌ప్లాన్‌ నిధులు దారి మళ్లుతున్నాయని, చంద్రబాబు పట్టించుకోకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.