ఎవరెవ్వరి వాడో...?

ఎవరెవ్వరి వాడో .... ఈ జీవుడు
ఎవరికి ఏమౌనో ....ఈ జీవుడు
ఎవరికి కొడుకు కాడీ ... జీవుడు
వెనుకు ఎందరికి తోబుట్టువీ...జీవుడు
ఎందరిని భ్రమయించడీ....జీవుడు
దుఖఃమెందరికి కావింపడీ....జీవుడు
ఎక్కడెక్కడి తిరుగుడీ....జీవుడు
వెనుక ఎక్కడో తన జన్మమీ....జీవుడు
ఎక్కడి చుట్టము తనకు .....ఈ జీవుడు
ఎప్పుడు ఎక్కడికీ ఏగునో ....ఈ జీవుడు