ఎంత కష్టం ఎంత కష్టం

శ్రీదేవి పరిచయం అక్కరలేని పేరు, మనిషి. ఆమె మరణం వెనుక దాగి ఉన్న ఈ సస్పెన్స్ ఏమిటి? ఆవిడేమిటి?? చనిపోవడం ఎమిటి? చనిపోయి రెండురోజులయినా అవిడకు నివాళి ఇవ్వకుండా ఈ రకరకాల కథనాలు ఏమిటి? ఇంత బాగా బ్రతికిన ఆవిడకు ఇలాంటి చావును ఆ భగవంతుడు ఆమె నుదుటన తప్పుగా రాసాడా? లేక ఎవరన్నా రాసారా?? అనేది ఒక మిలియన్ డాలర్ ప్రశ్న?? ఆమెకు మాత్రమే కాదు అభిమానులకు కూడా ఎంత కష్టం ఎంత కష్టం....

శ్రీదేవి మరణం సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. ఆమె మృతికి కారణాలపై ఎన్నో ఊహాగానాలు... మరెన్నో అనుమానాలు. ముందు గుండెపోటు... తర్వాత సర్జరీల ఎఫెక్ట్‌తో చనిపోయింందని, కాదు కాదు ప్రమాదవశాత్తూ కాలు జారి పడిపోయిందని. ఇలా పూటకో మాట వినిపించింది. ఇప్పుడు కేసు మరికొన్ని మలుపులు తిరిగింది. అయితే ఇక్కడ కొన్ని కీలక ప్రశ్నల్ని పబ్లిక్ ప్రాసిక్యూషన్ తెరపైకి తెస్తోందట. అసలు హోటల్ గదిలో ఆమెతో పాటూ ఎవరెవరు ఉన్నారు? ఒకవేళ బాత్ టబ్‌లో పడి ఉంటే బయటకు ఎందుకు రాలేకపోయారు? టబ్‌లో కేవలం అరగుడు లోతు నీళ్లు ఉంటాయి. కాబట్టి ఆమె చనిపోయే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయంటున్నారు. ఈ మర్డర్ మిస్టరీ వీడాలంటే లోతైన విచారణ జరగాలని పోలీసులు, ప్రాసిక్యూషన్ భావిస్తోందట.

భౌతికకాయం అప్పగింతపై ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. పోలీసులకు అనుమానాలు రావడంతో కేసు పబ్లిక్ ప్యాసిక్యూషన్ చేతుల్లోకి వెళ్లింది. అటు బోనీ కపూర్‌తో పాటూ హోటల్ సిబ్బందిని పోలీసులు ప్రశ్నించారు. అయితే వారు చెప్పిన సమాధానాలతో సంతృప్తి చెందలేదు. అలాగే బోనీ కపూర్, శ్రీదేవి కాల్ డేటాను కూడా పరిశీలిస్తున్నారు. బోనీ కపూర్ పాస్‌పోర్ట్ సీజ్ చేసినట్లు తెలుస్తోంది. దుబాయ్ విడిచి వెళ్లకూడదని చెప్పారట. హోటల్‌ రూమ్‌లో సీన్ రీ క్రియేట్ చేసే పనిలో ఉన్నారు. ఈ మిస్టరీ వీడిన తర్వాతే భౌతికకాయాన్ని అప్పగిస్తారట. అయితే పబ్లిక్ ప్రాసిక్యూటర్ కూడా మరోసారి పోస్ట్‌మార్టమ్ నిర్వహించాలని కోరారట.

శ్రీదేవి మెడికల్ రికార్డుల్ని పోలీసులు తెప్పించుకుంటున్నారట. గతంలో జరిగిన సర్జరీలతో పాటూ ఆమె వాడిన మెడిసిన్స్‌పై ఆరా తీసే పనిలో ఉన్నారు. మరోవైపు ముంబైలోని కపూర్ ఆఫీస్‌ సిబ్బంది మాత్రం ఇవాళ భౌతికకాయం ఇండియాకు తరలిస్తారని చెబుతున్నారట. ఇప్పటికే అనిల్ అంబానికి సంబంధించిన స్పెషల్ జెట్ దుబాయిలో రెడీగా ఉందని తెలుస్తోంది. ఫైనల్ క్లియరెన్స్ రాగానే, ఆ జెట్‌లోనే ముంబైకి తరలిస్తారు.