ఈ సారి పవన్‌ను టార్గెట్‌ చేసిన వర్మ

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ సోషల్‌ మీడియాను వేదికగా చేసుకుని తరుచుగా వివాదాస్పద ట్వీట్‌లు చేస్తూనే ఉంటాడు. మహిళా దినోత్సవం నాడు మహిళలపై పిచ్చి కూతలు కూసిన వర్మ తాజాగా ‘బాహుబలి 2’ ట్రైలర్‌ చూసి టాలీవుడ్‌ మొత్తాన్ని కూగా ఘోరంగా విమర్శించాడు. తాజాగా పవన్‌కళ్యాణ్‌ను టార్గెట్‌ చేసి ట్వీట్లను వదులుతున్నాడు. ఇటీవల పవన్‌ ఒక మొక్కతో ఫొటో దిగి నాకు మొక్కలంటే ప్రాణం, పచ్చదనం అంటే ఇష్టం అని ట్వీట్‌ చేశాడు. దాంతో ఈ విషయమై వర్మ భిన్నంగా ప్రతిస్పందించాడు. నిజంగా పవన్‌ పచ్చదనానికి ప్రియుడు అని, అది తన చిత్రాల ద్వారా చూపిస్తాడు అని ట్వీట్‌ చేశాడు.

తర్వాత పవన్‌ నిజంగా దేవుడు, నేను ఆయన్ను ఎల్లప్పుడు నమ్ముతాను అని తిరుపతి, యాదగిరి గుట్ట, భద్రాచలం తదతర దేవాలయాల్లో పవన్‌ను భర్తీ చేయాలని ట్వీట్‌ చేశాడు. దాంతో వర్మ పవన్‌ను తిట్టాడా...?? పొగిడాడా...?? అనేది సందేహంగా మారింది. వర్మ చేసిన ఈ ట్వీట్లపై పవన్‌ అభిమానులు చాలా సీరియస్‌ అవుతున్నారు. వర్మ ఏ ఉద్దేశ్యంతో చేశాడో కానీ అభిమానులు మాత్రం ఈ ట్వీట్లను వివాదాస్పదంగానే తీసుకుని వర్మపై కామెంట్ల రూపంలో తిట్లు కొనసాగిస్తున్నారు.