ఇదే నిజం!!!

నచ్చినంత నవ్వితే......పిచ్చివాడంటారు!!!
తనివితీరా ఏడిస్తే.......పిరికివాడంటారు!!!
మర్యాదగా ప్రవర్తిస్తే...అమాయకుడంటారు!!!!
ఙ్ఞానం ప్రదర్శిస్తే.....గర్విష్ఠి అంటారు!!!
తెలిసి తెలియనట్లుంటే......తెలివిలేదంటారు!!!
కలుగోలుగా మాట్లాడితే..వగరుబోతని అంటారు!!!
ఒంటరిగా ఉంటే....ఏకాకి అంటారు!!!
నలుగురిలో ఉంటే....తిరుగుబోతని అంటారు!!!
మౌనం వహిస్తే...చేతగానివాడు అంటారు!!!
కాదని వాదిస్తే....అతివాది అంటారు!!!
ఏదేమైతే నాకేంటిలే అని ఊరుకుంటే...స్వార్ధపరుడంటారు!!!

ఎలా బ్రతకాలో ఎరుకయ్యే లోపు
చితికిపోతుందేమో ఈ బ్రతుకు!!!

లోకమంతా మెచ్చునట్లు బ్రతకడమంటే
మనము చచ్చినట్లు బ్రతకడమే....

ఇదే నిజం!!!!