ఇక తర్వాతి టార్గెట్‌ జగన్‌... పులివెందులకే ఎసరు

తాజాగా ఏపీలో జరిగిన స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఫలితాల్లో తెదేపాదే పైచేయిగా నిలిచింది. జగన్‌ సొంత జిల్లా కడపలో కూడా వైకాపా పరాజయం పాలైంది. తెదేపా విజయవంతంగా అన్ని స్థానాలలో గెలుపొందండంతో సీఎం చంద్రబాబు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అసెంబ్లీ ప్రాంగాణంలో మీడియాతో ముచ్చటించిన చంద్రబాబు నాయుడు వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా బరిలో నిలుస్తాం అంటూ ధీమా వ్యక్తం చేశాడు. ఎమ్మెల్సీ ఫలితాలను చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని చెప్పుకొచ్చాడు. ఈ ఫలితాలతో మాలో కొత్త ఉత్సాహం పుట్టుకొచ్చింది. రాష్ట్రం కోసం మరితంగా కష్టపడి అభివృద్ది పథంలో నడిపిస్తాం అంటూ బాబు చెప్పుకొచ్చారు.

ఇక తర్వాతి టార్గెట్‌ జగన్‌. వచ్చే ఎన్నికల్లో జగన్‌ సొంతం నియోజక వర్గం పులివెందులలో కూడా పచ్చ జెండా నాటుతాం అంటూ జగన్‌ సీటుకే ఎసరు పెడుతున్నారు. వైకాపా ఎమ్మెల్యేలంతా కూడా రాజీనామ చేసి పోటీ చేస్తే ఎవరు గెలుస్తారనేది స్పష్టమవుతుంది అని చెప్పుకొచ్చాడు. జడ్పీటీసీలకు, ఎంపీటీసీలకు ఫిరాయింపుల చట్టం వర్తించదు అని బాబు చెప్పుకొచ్చాడు. వచ్చే ఎన్నికల్లో ఏకపక్షంగా గెలుస్తాం, జగన్‌ను సొంత నియోజక వర్గంలో కూడా ఓడిస్తాం అని చంద్రబాబు పరోక్షంగా సెలవిచ్చాడు.