ఆయనతో రొమాన్స్‌ రకుల్‌ మనుస్సు దోచేసిందట!

అందాల ముద్దుగుమ్మ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ తక్కువ సమయంలో స్టార్‌ హీరోయిన్‌గా ఓ వెలుగు వెలుగుతోంది. ఈ అమ్మడు మొదటి నుండి కూడా తన చిత్రాలలో మోడ్రన్‌ అమ్మాయిగా కనిపించే ప్రేక్షకుల మదిని దోచేస్తోంది. ప్రస్తుతం రకుల్‌ చేతిలో మూడు ప్రాజెక్ట్‌లు ఉన్నాయి. వాటిలో చైతూతో ఒక చిత్రంలో, మహేష్‌ చిత్రంలో, బెల్లంకొండ సాయిశ్రీనివాస్‌ సరసన ఒక చిత్రంలో రొమాన్స్‌ చేస్తోంది. అయితే ఈ మూడు పాత్రలలో రకుల్‌కు చైతూతో రొమాన్స్‌ బాగా నచ్చిందట. రకుల్‌, చైతూలు కళ్యాణకృష్ణ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్ర షూటింగ్‌ దాదాపు పూర్తి కావొచ్చింది. ‘రారండోయ్‌ వేడుక చేద్దాం ’ అనే టైటిల్‌ను ఫిక్స్‌ చేయాలని చిత్ర యూనిట్‌ భావిస్తున్నారు.

చైతూ సరసన ఈ చిత్రంలో రకుల్‌ పల్లెటూరి అమ్మాయిగా నటిస్తోంది. ఇప్పటివరకు చాలా మోడ్రన్‌గా నటించిన రకుల్‌ ఈ చిత్రంలో అచ్చతెలుగు, పల్లెటూరి అమ్మాయిలా కనిపించనుందట. అందుకే ఈ చిత్రంలో నటించే పాత్ర తనకు బాగా నచ్చిందని రకుల్‌ చెబుతోంది. పల్లెటూరి అమ్మాయిగా నటిస్తుంటే మంచి అనుభూతి కలుగుతుంది, ఆ పాత్ర నా మనస్సు దోచేసింది అని రకుల్‌ చెబుతోంది. మోడ్రన్‌ పిల్లగా తన అందాలను ఆరబోసిన రకుల్‌ ఈ చిత్రంలో పల్లెటూరి అమ్మాయిగా అందాలను దాచి దాచి వడ్డస్తుింది కాబోలు అని అభిమానులు ఆసక్తిగా చూస్తున్నారు. పల్లెటూరి అమ్మాయిగా చైతూతో రొమాన్స్‌ వావ్‌ చాలా బాగుంది.