"ఆక్సిజన్" సినిమా రివ్యూ

చిత్రం: ఆక్సిజన్
రేటింగ్: 2.5/5.0
సంగీతం : యువన్ శంకర్ రాజా
దర్శకత్వం :జ్యోతికృష్ణ
నిర్మాత: ఆం రత్నం , ఐశ్వర్య

స్టారింగ్ : గోపీచంద్ , అను ఇమాన్యుయల్ , రాశి ఖన్నా , సాక్షి చౌదరి , జగపతిబాబు తదితరులు...

‘లౌక్యం’ సినిమా తరువాత ఆ స్థాయి విజయం కోసం గోపీచంద్ చాలా ప్రయత్నించాడు. కానీ ఆయన ప్రయత్నాలు ఫలించలేదు. వరుస ఫ్లాపులతో డీలాపడిన గోపీచంద్ తాజాగా ‘ఆక్సిజన్’ సినిమాలో నటించాడు. ఈ చిత్రం గురువారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా అయినా గోపిచంద్‌కు ఆశించిన విజయాన్ని అందించిందా, లేదా అనే విషయం రివ్యూలోకి వెళ్లి తెలుసుకుందాం!

కథలోకివెళితే...
రఘుపతి(జగపతి బాబు) రాజమండ్రిలోని తన కుటుంబ సభ్యులతో కలిసి జీవిస్తుంటాడు. ఆయన కూతురు శృతి(రాశిఖన్నా)ని పెళ్లి చేసుకోవడానికి అమెరికా నుంచి కృష్ణప్రసాద్(గోపిచంద్) వస్తాడు. అయితే రఘుపతికి, ఆయన కుటుంబానికి గుర్తు తెలియని శత్రువుల నుంచి ముప్పు ఉంటుంది. దీంతో కూతురికి త్వరగా పెళ్లి చేసి అమెరికా పంపించాలని రఘుపతి నిర్ణయించుకుంటాడు. అయితే అనుకోకుండా కృష్ణప్రసాద్‌ను, శృతిని రఘుపతి శత్రువులు కిడ్నాప్ చేస్తారు. అసలు రఘుపతిని చంపాలనుకుంటున్నది ఎవరు? తన కుటుంబానికి తెలియకుండా రఘుపతి ఏదైనా నిజం దాస్తున్నాడా? కృష్ణప్రసాద్, శృతిలను విడిచిపెట్టారా? చివరికి కథ ఎలాంటి మలుపులు తీసుకుంది? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
హీరో గోపీచంద్ ఎంతో నమ్మకంతో చేసిన ఆక్సిజన్ ఆయన ఎదురు చూస్తున్న సక్సెస్ అందించినట్టే . గోపి కొత్తగా చేసాడు అని చెప్పలేకపోయినా చాలా బాగా చేసాడు అని చెప్పుకునే సందర్భాలు ఈ సినిమాలో చాలా కనిపిస్తాయి. జగపతి బాబు, రాశి ఖన్నా కూడా బాగా చేశారు. అను ఇమ్మానుయేల్, వెన్నెల కిషోర్, ఆశిష్ విద్యార్థి, షియాజీ షిండే, అభిమన్యు సింగ్ ఈ సినిమాకు ప్లస్ అయ్యారు...

సాంకేతికపరంగా...
యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం హైలైట్ అని చెప్పుకోవాలి. ఛోటా కె.నాయుడు ఫోటోగ్రఫీ తో పాటు ఏ.ఏం.రత్నం స్క్రీన్ ప్లే సినిమాకు అదనపు బలం తెచ్చిపెట్టాయి.ఈ సినిమాకు జ్యోతికృష్ణ కథ ఎంత రొటీన్ అనిపించిందో ఏ .ఎం . రత్నం స్క్రీన్ ప్లే అంత కొత్తగా ఉంటుంది. మొత్తానికి సినిమా అయిపోయాక ఇలాంటి సినిమాని ఇలాగా తీయొచ్చా అన్న ఆశ్చర్యంతో ప్రేక్షకుడు బయటకు వస్తాడు.

విశ్లేషణ...
ఏ సినిమా అయినా ప్రేక్షకులకి కనెక్ట్ కావాలంటే కొత్త విషయం అయినా చెప్పాలి. లేదా బాగా తెలిసిన విషయాన్ని కొత్త కోణంలో అయినా చెప్పాలి. ఇక్కడ ఆక్సిజన్ లో జ్యోతి కృష్ణ ఆ రెండు సక్సెస్ ఫుల్ ఫార్ములాలు కలిపి తీసాడు. రొటీన్ రివెంజ్ స్టోరీ లో ఊహకు అందని విషయాలు పొందుపరిచాడు. సినిమా మొదటి భాగం వరకు కథను బాగానే నడిపించారు. ఇంటర్వల్ ట్విస్ట్ కూడా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుంది. కానీ సెకండ్ హాఫ్‌లో ఆ క్యూరియాసిటీని కొనసాగించడంలో విఫలమయ్యారు. ద్వితీయార్ధంలో వచ్చే ప్రతి సన్నివేశం ఊహాజనితంగా ఉంటుంది. మొత్తానికి ఫస్ట్ హాఫ్ వరకు ఎంటర్‌టైన్ చేసిన దర్శకుడు అదే స్థాయిలో రెండో భాగాన్ని చూపించలేకపోయారు. దీంతో ‘ఆక్సిజన్’ ఓ మోస్తరు సినిమాగా మిగిలిపోయింది.

నచ్చినవి...
స్క్రీన్ ప్లే
ట్విస్ట్స్
హీరో

నచ్చనివి...
రొటీన్ కథ

చివరగా...
ఇది మనకు తెలిసిన రోటీన్ ఆక్సిజన్....