"అ!" సినిమా రివ్యూ

చిత్రం: అ!
రేటింగ్: 2.0/5.0
బ్యానర్: వాల్ పోస్టర్
సంగీతం : రాబిన్ మార్క్
దర్శకత్వం : ప్రశాంత్ వర్మ
నిర్మాత: నాని, ప్రశాంతి

స్టారింగ్ : కాజల్ అగర్వాల్, నిత్యామీనన్, రెజీనా, ఈషా రెబ్బా, శ్రీనివాస్ అవసరాల, ప్రియదర్శి, మురళి శర్మ, నాని, రవితేజ తదితరులు

హీరోగా వరస విజయాలతో దూసుకుపోతున్న నేచురల్ స్టార్ నాని ఇప్పుడు నిర్మాతగా మారాడు. వాల్ పోస్టర్ అనే బ్యానర్‌ను ఏర్పాటుచేసి తొలి సినిమాను నిర్మించాడు. అదే ‘అ!’. ప్రశాంత్ వర్మ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ముఖ్యంగా నిత్యా మీనన్, కాజల్ అగర్వాల్, రెజీనా, ఈషా రెబ్బ వంటి స్టార్లు ఈ సినిమాలో నటించడంతో పాటు ఓ కొత్త కాన్సెప్ట్‌తో వస్తున్న సినిమా కావడంతో ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు.నాని మీద ఉన్న నమ్మకం.. దీనికితోడు భారీ తారగణం , సినిమా అంచనాలను భారీగా పెంచేశాయి.మరీ నాని నిర్మాతగా కూడా విజయం సాధించాడో లేదో చూద్దాం

కథలోకివెళితే...
రాధ(ఈషా రెబ్బ) తను ఒక అమ్మాయిని ప్రేమించానని పెళ్లి కూడా చేసుకుంటానని కృష్ణవేణి(నిత్యామీనన్)ని తన తల్లితండ్రులకు పరిచయం చేస్తుంది.మీరా(రెజీనా) డ్రగ్స్‌కు బానిస. తన బాయ్‌ఫ్రెండ్ చేసే దొంగతనానికి సహాయం చేసి లైఫ్‌లో సెటిల్ అయిపోవాలని అనుకుంటుంది. యోగి(మురళీశర్మ) తనకంటే గొప్ప ఇంద్రజాల మాంత్రికుడు లేడని ఫీల్ అవుతుంటాడు. నలభీమ(ప్రియదర్శి) చెఫ్‌గా పనికోసం ప్రయత్నిస్తుంటాడు. తనకు వంట రాకపోయినా.. యూట్యూబ్‌లో వంటలు చూస్తూ కుస్తీలు పడుతుంటాడు. కాళి(కాజల్) అనే అమ్మాయి తనను తాను చంపుకోవడానికి సిద్ధపడుతుంది. శివ(శ్రీనివాస్ అవసరాల) ఎప్పటికైనా టైమ్ మెషీన్ కనిపెట్టి గతంలోకి వెళ్లి కోల్పోయిన తన తల్లితండ్రులను కలవాలనుకుంటాడు. ఇటువంటి పాత్రలన్నీ ఒక చోట ఉంటే ఎలాంటి సంఘటనలు చోటుచేసుకుంటాయో అదే ‘అ!’.

నటీనటుల ఫర్ఫార్మెన్స్...
నటీనటులు సినిమాకు పెద్ద ప్లస్. ప్రతి ఒక్కరూ తమ తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. చేప, చెట్టులతో మాట్లాడించడం కొత్తగా అనిపిస్తుంది. వాటిని కూడా పాత్రలు గానే చెప్పుకోవాలి. వాటికి నాని, రవితేజల వాయిస్ ఓవర్ యాప్ట్.

సాంకేతికపరంగా...
స్క్రీన్‌ప్లే ఆధారంగా నడిచే సినిమాలు చాలా వచ్చాయి. కానీ ‘అ!’ వాటన్నింటికంటే ప్రత్యేకమని చెప్పాలి. సినిమా క్లైమాక్స్ వరకు అసలు కథలో ఏం జరుగుతుందో సగటు ప్రేక్షకుడు అర్థం చేసుకోవడం కాస్త కష్టమే. స్క్రీన్‌ప్లేను అంత పకడ్బంధీగా ప్రేక్షకులను పక్కదారి పట్టించకుండా రాసుకున్నాడు దర్శకుడు. ప్రతి సన్నివేశంలో తరవాత ఏం జరుగుతుందనే ఉత్సుకతను క్రియేట్ చేయగలిగాడు.సినిమాటోగ్రఫీ, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సినిమాకు హైలైట్. తక్కువ బడ్జెట్‌లో క్వాలిటీతో సినిమాను రూపొందించారు.

విశ్లేషణ...
కథను సింపుల్‌గా చెప్పాలంటే మల్టిపుల్ పెర్సనాలిటీ డిసార్డర్ అనే వ్యాధితో బాధపడే కాళి అనే అమ్మాయి తనలో కలిగే ఒక్కో ఫీలింగ్‌కు ఒక్కో క్యారెక్టర్‌ను సృష్టించుకుంటూ పోతుంది. ఆ పాత్రల ద్వారా తన భావాలను చెప్పే ప్రయత్నం చేస్తుంది. అయితే ఆ పాత్రల్లో క్లారిటీ లేకపోవడం బాధాకారం.సగటు ప్రేక్షకుడికి ఈ సినిమా ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చెప్పలేని పరిస్థితి. మాస్ ఆడియన్స్ సంగతి ఇక సరేసరి.కమర్షియల్‌గా ఈ సినిమా వర్కవుట్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ అనే చెప్పాలి. దర్శకుడిగా ప్రశాంత్ చేసిన ఈ ప్రయత్నాన్ని మెచ్చుకోకుండా ఉండలేం. కొన్ని చోట్ల క్లారిటీ మిస్ అయింది కానీ ఓవరాల్‌గా సినిమా ఓకే అనిపిస్తుంది.

నచ్చినవి...
అందరి ఫర్ఫార్మెన్స్
స్క్రీన్ ప్లే

నచ్చనివి...
కథనం
కొన్ని తడబాటులు

చివరగా...
ఎంతవరకు కనెక్ట్ అవుతుందనేది చెప్పలేని పరిస్థితి!!!