అలాంటి వాటిలో కూడా నటించాల్సి వచ్చింది

ఇటీవల హీరోయిన్లను ఇష్టం వచ్చినట్టు వాడుకుంటారు అని చాలామంది హీరోయిన్లు మీడియా ముందు చాలా ధైర్యంగా చెబుతున్నారు. అయితే ఇక హీరోయిన్లు ఎక్కడ కనబడినా కూడా మీడియా వారు మీకు అలాంటి పరిస్థితులు ఏమైనా ఎదురయ్యాయా..?? అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలె వేధింపుల గురించి తమన్నా స్పందించగా తాజాగా కాజల్‌ కూడా స్పందించింది. అయితే తనను వేధింపులు ఏం లేవని, అలాంటి సిట్యుయేషన్‌ ఇప్పటి వరకు రాలేదని కాజల్‌ చెప్పుకొచ్చింది. కొంతటమంది నటీమణులు ప్రతిభ ఉండి కూడా అవకాశాల కోసం కొన్నిటికి రాజీ పడాల్సి వస్తుందని చెప్పడం భాదాకరం అని కాజల్‌ చెప్పుకొచ్చింది.

చిత్ర పరిశ్రమలో సర్దుకుపోవాలి అనేది కూడా కీలకమైన అంశం. కెరియర్‌ మొదట్లో నాకు ఏది తెలిసుండేది కాదు, అందుకే నాతో అసభ్యకరమైన సన్నివేశాలు కూడా చేయించారు పాటల్లో అయితే దారుణంగా చూపించారు. కానీ ఇప్పుడు నాకు సినిమాలపై పూర్తి అవగాహన వచ్చింది. నేను ప్రస్తుతం చాలా కంఫర్ట్‌గా ఉన్నాను, నాకు నచ్చిన పాత్రనే చేసుకునే హక్కు నాకుంది. ఎక్కడ రాజీ పడాల్సిన అవసరం లేదు. మొదట్లో చేసిన తప్పులు ఇప్పుడు చేయను. అలాంటి వాటిలో నటించడం ఇంకా భాదగానే ఉంది. కానీ ఇప్పుడు అలా నటించను. నాకు నచ్చినట్టు నేను సినిమాలు చేసుకుంటాను అని కాజల్‌ క్లారిటీ ఇచ్చింది.