అబద్ధాలలో చంద్రబాబును మించిపోయారు

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఒక్క హామీని కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నెరవేర్చలేదని వైకాపా నాయకురాలు రోజా విమర్శించారు. వైకాపా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఆమె చంద్రబాబు కుమారుడు లోకేష్ మాటలు జబర్దస్త కామెడీ షో కూడా ఎందుకూ పనికి రాకుండా పోతుందని పేర్కొన్నారు. లోకేష్ రాష్ట్రంలో నీటి సమస్యను సృష్టించడానికే పంచాయతీరాజ్ శాఖ తీసుకున్నానని లోకేష్ చెప్పారంటే ఆయన జ్ణానం ఏపాటిదో అర్ధం అవుతున్నదని రోజా అన్నారు. లోకేష్ తెలివితేటల్లో జలీల్ ఖాన్ ను, అబద్ధాలలో చంద్రబాబును మించిపోయారని రోజా విమర్శించారు.